Andhra PradeshNews Alert

ప్రజలను మోసం చేయడం మంచిది కాదు జగన్.. బూరగడ్డ వేదవ్యాస్

Share with

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. చిరు వ్యాపారులు , హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున గత ఆరు నెలల్లో అందించిన రూ.395 కోట్ల వడ్డీ మొత్తాన్ని  ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా రూ. 10 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ బూరుగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ.. జగనన్న తోడు పథకానికి కేంద్రం రూ.10 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లు ఇస్తోందన్నారు. ఎక్కువ లబ్ధిదారులను చూపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తక్కువమందిని చూపిస్తోందని ఇది ఎక్కడి న్యాయం జగన్ అన్నారు. ప్రభుత్వం నుంచి రూ.10వేలు లబ్ధిదారుల ఖాతాలో పడినట్లు భ్రమ కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఈవిధమైన మోసం ప్రజలకు చేయడం జగన్‌కి మంచిది కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి బటన్ నొక్కితే అందే డబ్బు కాదు అని విమర్శించారు. రాష్ట్రం చెల్లించే 6 కోట్లు బ్యాంకులకు ఇచ్చే వడ్డీ కింద వెళ్తోందని… బ్యాంకుల నుంచి తెచ్చుకొని తిరిగి బ్యాంకులకు కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలేదని అనేక చోట్ల ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిపారు. మున్సిపాల్టీలు, మండలాల వారీగా ప్రజా క్షేత్రంలో పెట్టినప్పుడే అసలు లబ్ధిదారులు ఎంతమంది అనేది తెలుతుందన్నారు. దీంతో ప్రభుత్వ పబ్లిసిటీ కూడా పీక్ కు వెళ్తోందన్నారు బూరుగడ్డ వేదవ్యాస్.