అట్టహాసంగా వైసీపీ ప్లీనరీ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైసిపి పార్టీ 3వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం హట్టహసం గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, మంత్రులు, పార్టీ సీనయర్ నాయకులు హాజరయ్యరు. తొలుత పార్టీ జెండా ను పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ లు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.
2011 మార్చిలో పార్టీ ఆవిర్భావం అయిన దగ్గర నుండి నేటి వరకు అనేక ఎదురైన అనుభవాలను, అవమానాలను, కష్ట నష్టాలను చవిచూడాల్సి వచ్చిందనీ వివరించారు. తన ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. తన బాటలో ఎన్నో ఒడదుడుకులు ఎదురైనా, తన కుటుంబంపై పగ పట్టినా, కుట్రలు పన్నినా, దుష్ప్రచారం చేసినా వెనుదిరగలేదన్నారు. జగమంత కుటుంబం తనతోనే ఉండి అండగా నిలిచిందన్నారు.
చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో గత ఎన్నికల్లో ప్రజల ఆదరణ లభించిందని, 175 స్థానాలకు 151 స్థానాలు దక్కాయని చెప్పారు. ప్రతి పక్షం 23 స్థానాలకు పరిమితం అయిందన్నారు. అధికారం అంటే అహంకారం కాదని… మమకారం అని నమ్మి 3ఏళ్ల పాలన సాగించామన్నారు. పేదల కోసం, ప్రజల కోసం అన్ని వర్గాల ప్రయోజనాల కోసం చెప్పిన మాటకి నిలబడి పనిచేశమన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 95 శాతం పూర్తి చేశమన్నారు. ఇది ఎన్నికలకే పరిమితం కాదని నిరుపించామన్నారు. ప్రతి పక్షం మేనిఫెస్టోను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ దొరక్కుండా మాయం చేశారని ఎద్దేవా చేశారు. 95శాతం హామీల అమలును చూసి టీడీపీ భయపడుతుందని విమర్శించారు.
ప్రజల కోసం రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు జగన్. పరిపాలనలో సంస్కరణలకు ప్రవేశ పెట్టి కార్యాచరణలో చూపామన్నరు. గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయి పరిపాలన సాగించామన్నారు. కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా, అవినీతి, లంచాలకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకమైన పాలన సాగించామన్నారు. మహిళా సాధికారిత, రైతు శ్రేయస్సుకు ఎంతగానో కృషి చేశామన్నారు. నూతన విద్యా విధానంతో పిల్లల భవిష్యత్ మార్చేలా , పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు.