Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

కరెంట్ చార్జీల పెంపుపై క‌దం తొక్కిన వైసీపి

కూట‌మి ప్ర‌భుత్వం పెంచిన క‌రెంట్ చార్జీలను నిర‌శిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీసి అధ్యక్షులు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైఎస్సార్ పోరుబాట పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వ‌హించారు.దీంతో వెంకటాచలం మండల కేంద్రం జనసంద్రంగా మారింది.వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నినాదాలతో వెంక‌టాచ‌లం మండ‌లం ద‌ద్ద‌రిల్లింది.ఈ సంద‌ర్భంగా కాకాణి మాట్లాడుతూ… ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచారంలో చంద్ర‌బాబు నాయుడు అధికారానికి వ‌స్తే క‌రెంట్ చార్జీలు పెంచ‌బోమ‌ని చెప్పి తీరా అధికారానికి వ‌చ్చాక చార్జీల మోత మోగిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.బాబు ష్యూరిటీ భ‌విష్య‌త్‌కి గ్యారంటీ అని ప్ర‌జ‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి ఓట్లేయించుకున్నార‌ని,ఇప్పుడు ష్యూరిటీ లేదు,భ‌విష్య‌త్తుకు గ్యారంటీ లేద‌ని విమ‌ర్శించారు.బాబు ష్యూరిటీ అంతా బోగ‌స్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని నలుమూలల నుండి వేల సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు త‌ర‌లివ‌చ్చి త‌మ నిర‌శ‌న వ్య‌క్తం చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కి కాకాణి, అన్నం విజయ్ కుమార్ వినతి పత్రం అంద‌జేశారు.