Andhra PradeshHome Page Slider

వివేక వీడియోలు రిలీజ్ చేయడం దుర్మార్గమన్న వైఎస్ సునీత

40 ఏళ్లు పులివెందులలో సేవ చేసిన వైఎస్ వివేకానంద రెడ్డికి, అన్యాయం జరిగితే.. బయటకు చెప్పుకోలేక బాధపడతున్నామన్నారు ఆయన కుమార్తె వైఎస్ సునీత. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపుడుతుందని, ప్రజల్లో తిరుగుతుంటే ఆయన పట్ల ఎంతటి అభిమానం ఉందో తెలుస్తోందన్నారు. ప్రజలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారన్నారు. ప్రజలు న్యాయం వైపు ఉన్నారన్న నమ్మకం కలుగుతుందన్నారు. రోజు రోజుకు వివేక పట్ల ప్రేమ, అభిమానం పెరుగుతుందని తనకు అర్థమయ్యిందన్నారు. వైఎస్ వివేక వీడియోలను ఎందుకు? ఎవరు బయటపెట్టారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య కేసులో తాను న్యాయ పోరాటం చేస్తుంటే.. ఇలా ఆననను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. వివేకాను ఎందుకు చంపారని ఎవరు చంపాల్సి వచ్చిందని తాను ప్రశ్నిస్తుంటే… ఆయన జీవితంలోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టి అవమానిస్తున్నారని విరుచుకుపడ్డారు. చనిపోయిన వ్యక్తి సంజాయిషీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నీచానికి ఒడిగడుతున్నారన్నారు. అలాంటి వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సునీత ఆగ్రహం వ్యకం చేశారు.