పీఏసీ ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం
పీఏసీ ఎన్నికలపై వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. గతంలో ప్రతిపక్ష హోదా లేనివారు కూడా పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారన్నారు. అవినీతి జరగకుండా వాచ్‌డాగ్‌లాగ పీఏసీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా అడిగినా ఇవ్వడం లేదని, ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అందుకే బాయ్‌కాట్ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త నినాదం తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పద్దులకు ప్రభుత్వమే ఎలా లెక్క చూస్తుందని ప్రశ్నించారు. అలా చూస్తే అవినీతిపై ప్రశ్నించేవారెవరన్నారు. ప్రపంచదేశాలన్నీ ప్రతిపక్షానికే పీఏసీ పదవి ఇస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రాబోయే తరాలకు చెడు సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు.

