Home Page SliderTelangana

‘హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా?’..కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పడి వరకూ 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను కారణం లేకుండా సస్పెండ్ చేసిందని మండిపడ్డారు.  హక్కులు అడిగిన వారిని అడ్డగోలు సాకులతో సస్పెండ్ చేశారని, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారని విమర్శించారు. వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.