భార్య గొంతు కోసి…ఆపై దహనం చేసి
హైద్రాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఫైజ్ ఖురేషి అనే వ్యక్తి భార్య ఖమర్ బేగం పై అనుమానంతో అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు.ఈ విషయం బయటకు పొక్కితే తనకు శిక్ష తప్పదని తెలుసుకుని మృదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అగ్ని ప్రమాదంగా చిత్రీకిరించే ప్రయత్నం చేశాడు.పెద్దగా కేకలు వేశాడు. అయితే మండుతున్న మృతదేహం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో అక్కడికొచ్చిన వారు గమనించి బంధువులకు చెప్పారు.దీంతో హంతకునిపై మహిళ బంధువులు దాడికి ప్రయత్నించడంతో చేసేది లేక సమీప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							