ఒలింపిక్స్‌లో మనవాళ్లకు పతకాలు ఎందుకు రాలేదంటే..
పారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు చివరి నిముషంలో పతకాలు చేజార్చుకుంటున్నారు. అధిక ఒత్తిడి కారణంగానే త్రుటిలో పతకాలు చేజారుతున్నాయని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. భారత క్రీడాభిమానులు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న నెంబర్ ఒన్ ఆటగాళ్లు సైతం పతక పోరులో వెనుకబడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు ఏడెనిమిది పతకాలు అందినట్లే అంది, చివరి క్షణంలో పరుల పాలవుతున్నాయి. ఇతర ప్రపంచపోటీలలోనూ, ఆసియా కప్ వంటి పోటీలలో పతకాలు సాధించిన భారత్ ఒలింపిక్స్‌లో మాత్రం తడబడుతున్నారు. మానసిక ధృఢత్వం పెంచుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకూ కేవలం షూటింగ్‌లో మాత్రం మూడు కాంస్య పతకాలు సాధించింది భారత్. మనుబాకర్ మహిళల షూటింగ్‌లో మూడవ స్థానంలో నిలిచి, కాంస్యపతకం సాధించిన సంగతి తెలిసిందే. మనుబాకర్ సరబ్‌జ్యోత్‌తో కలిసి కాంస్యం సాధించింది. మరో షూటర్ స్వప్నిల్ కూడా కాంస్యపతకం సాధించారు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీలలో పతకాలు ఆశించిన భారత్‌కు నిరాశే మిగిలింది. షూటింగులో నాలుగవ పతకం వస్తుందనుకున్న మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ జోడీ కూడా తృటిలో పతకం చేజార్చుకున్నారు. సింధు కూడా పోటీలో పతకం సాధించలేకపోయింది. నేడు హాకీ, రెజ్లింగ్‌లోనైనా గెలిస్తే కనీసం రెండు పతకాలు రావచ్చు. దీనితో నాలుగవ పతకం కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

