accidentAndhra PradeshHome Page SliderNews Alert

కారులో విషాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారులను ఒక కారు పొట్టనపెట్టుకుంది. గ్రామంలోని బీసీ కాలనీలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా నీళ్ల ట్యాంకువద్ద ఉన్న కారులోకి ఆడుకుంటూ నలుగురు చిన్నారులు చేరుకున్నారు. పొరపాటున డోర్లు వేయడంతో తలుపులు లాక్ అయిపోయాయి. దీనితో ఊపిరాడక వారందరూ మృత్యుఒడిని చేరుకున్నారు. మూడుగంటల అనంతరం వారిని వెదకుతూ వెళ్లిన పెద్దలు కారు అద్దాలు బద్దలుకొట్టి వారిని వెలుపలికి తీసుకువచ్చారు. అప్పటికే వారు చనిపోయారు. బూర్లె చారులత(7), బూర్లె జాస్రిత(8)లు అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు దుఃఖానికి అంతేలేకుండా పోయింది. మరో ఇద్దరు చిన్నారులు కంది మణీశ్వరి(6), పండి ఉదయ్(7)ల తల్లిదండ్రులు కూడా విషాదంలో మునిగి పోయారు. కారు అద్దాలు నల్లగా ఉండడంతో దానిలో చిన్నారులున్నట్లు ఎవరూ గుర్తించలేదు. కారు వైజాగ్ నుండి పెళ్లి కోసం వచ్చిన వ్యక్తిదని సమాచారం. కారుకు లాక్ ఎందుకు వేయలేదు? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.