సోమవారం నుండి మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుండి మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణం జరిగే 9న, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో ఈ నెల 8 నుండి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు.

