Andhra PradeshNews

ఈనెల 26 నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధం కాబోతున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈసారి వైభవంగా జరిపేందుకు TTD నిర్ణయించింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా అంతరాలయంలోనే నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను, ఈసారి కరోనా విస్తృతి బాగా తగ్గినందువల్ల ఈసారి భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది టిటిడి.

ఈ నెల 20 న ఉదయం 6 గంటలనుండి 11 గంటల వరకూ కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందుగా చేయవలసి ఉంటుంది.

ఈ నెల 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి, 27 వ తేదీనుండి అక్టోబర్ 5వ తేదీ వరకూ స్వామివారు వివిధ రూపాలలో, వివిధ వాహనాలలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వాహన సేవల షెడ్యూల్:

సెప్టెంబరు 26  – అంకురార్పణ

సెప్టెంబరు 27 –  ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ

సెప్టెంబ‌ర్ 28   చిన్న శేష వాహ‌నం, స్నపన  తిరుమంజ‌నం, హంస వాహ‌న సేవ

సెప్టెంబ‌ర్ 29   సింహ వాహ‌న సేవ‌, ముత్యపు పందిరి వాహ‌న సేవ‌

సెప్టెంబ‌ర్ 30   క‌ల్పవృక్ష వాహ‌న సేవ‌, స‌ర్వ భూపాల వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్  01  మోహిని అవ‌తారంలో స్వామి వారి ద‌ర్శనం, గ‌రుడ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్  02  హ‌నుమంత వాహ‌న సేవ‌, గ‌జ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్  03  సూర్యప్రభ వాహ‌న సేవ‌, చంద్రప్రభ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్  04  ర‌థోత్సవం, అశ్వ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్  05  చ‌క్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం

SVBC ఛానెల్ వారు ప్రతిరోజూ ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టిటిడి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తోంది.