ఫాల్కన్ స్కాం.. జెట్ విమానం సీజ్..
ఫాల్కన్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న అమర్ దీప్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు పవన్, కావ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కీలక నిందితులు అమర్ దీప్ సహా పలువురు పరారీలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే.. తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి అమర్ దీప్ కుచ్చు టోపీ పెట్టాడు. ఈ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కాంలో దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. వీటిని వివిధ రూపాల్లో 14 కంపెనీలలో అమర్ దీప్ పెట్టుబడులు పెట్టాడు. కేసు నమోదు కావడంతో కంపెనీ యజమానులు కొందరు డిపాజిటర్లకు రూ.850 కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా రూ.850కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ డబ్బులతోనే రూ.14కోట్లు పెట్టి ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు చేసి అందులోనే నిందితులు దుబాయ్ పారిపోయినట్లు అధికారులు తెలిపారు.