ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఇదే..
ఛాంపియన్స్ ట్రోఫీ -2025 భారత జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌ను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనౌన్స్ చేశారు. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలక్ట్ చేశారు. వైస్ కెప్టెన్‌గా గిల్ ఉంటారు. ఈ టీమ్‌లో జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, అక్షర పటేల్, సుందర్, కులదీప్, షమీ, అర్షదీప్ సింగ్ లను సెలక్ట్ చేశారు. ఈ 15 మంది సభ్యుల జట్టునే ఇంగ్లాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఈ ట్రోఫీలో గ్రూప్ ఏలో భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాగేశ్ జట్లు ఉన్నాయి. ఇండియా, పాక్‌ల మధ్య ఫిబ్రవరి 23న టోర్నీ జరగబోతోంది. ఇండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగబోతున్నాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.