HealthHome Page Slider

ఈ గింజలు ఆడవారికి వరం..

శాఖాహారంలో కూడా మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్లు, ఆహార పదార్థాలు ఉన్నాయో తెలుసా? వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాబర్ ఉన్నాయి. గ్రుడ్లు, మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే..? అవిసె గింజలు. దీనిని ఇంగ్లీష్ లో ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ ప్లాక్స్ సీడ్స్ 100 శాతం శాఖాహారి. 100 గ్రా. ఫ్లాక్స్ సీడ్స్ లో 10 గ్రా. ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో కాల్షియం, ఐరన్ ఉంటుంది. వీటితోపాటు అనేక రకాల న్యూట్రియన్స్ ఉంటాయి. అవిసె గింజలను ప్రతి రోజు తిన్నారంటే గ్రుడ్లు, మటన్, చికెన్, చేపలు తినే అవసరమే లేదు. నాన్ వెజ్ కి దూరంగా ఉన్నవారు అలిసి గింజలను తింటే మాంసం సేవించినంత ప్రొటీన్లు అందుతాయి.

ఆడవారు తమ మొత్తం జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని ఎదుర్కొని నిలబడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. అవిసె గింజలు నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు చాలా బెనిఫిట్స్ పొందుతారు. అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్స్ లను సమతుల్యం చేస్తాయి. నెలసరి సమస్యను దూరం చేస్తాయి. అంతేకాకుండా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఎముకలను , కండరాలను బలంగా మారుస్తాయి. జుట్టు, చర్మ ఆరోగ్యానికి సైతం అవిసె గింజలు అండగా ఉంటాయి.