Home Page SliderNational

కాంగ్రెస్ కూటమికి మేము పనికిరామా..ఎంఐఎం అసంతృప్తి

Share with

26 పార్టీలతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విపక్ష కూటమికి తమకు ఆహ్వానం లేకపోవడంతో ఎంఐఎం పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ పార్టీ కూడా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే పనిచేస్తోందని ఎంఐఎం మజ్లిస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పథాన్ పేర్కొన్నారు.  లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ మమ్మల్ని అంటరానివాళ్లుగా భావించారేమో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉన్న నితీశ్ కుమార్, ఉద్ధవ్ థాక్రే, మొహబూబా ముఫ్తీ, చివరికి గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్‌ను తిట్టిన కేజ్రీవాల్‌ను కూడా పిలిచిన కాంగ్రెస్‌కు మా పార్టీ, పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కనిపించలేదన్నారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్ (INDIA) పేరుతో ఏర్పడిన విపక్ష కూటమి వచ్చే ఏడాదిలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.