రేవంత్ మాటలు అట్లుంటాయి@కేటిఆర్
ఢిల్లీలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే గ్యారంటీలను అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి కేటిఆర్ జోకులు పేల్చుతున్నారు.శుక్రవారం బీ.ఆర్.ఎస్.ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.అమ్మకి అన్నం పెట్టని వాడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అని రేవంత్ వ్యాఖ్యలనుంద్దేశించి వ్యంగాస్త్రాలు విసిరారు.తెలంగాణలో రైతు భరోసా కింద రుణ మాఫీ చేస్తానని తప్పించుకుని ఢిల్లీ గల్లీల్లో తిరుగుతున్నాడు మన చిట్టినాయుడు అంటూ ఎద్దేవా చేశారు.6గ్యారంటీలను అమలు చేయలేక తెలంగాణాలో చేతులెత్తేసిన రేవంత్…ఢిల్లీలో గ్యారంటీలను అమలు చేయిస్తడా…ఇది నమ్మేడిదేనా అంటూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.ప్రతీ గ్రామంలో ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.