HMPV వైరస్ తో ప్రమాదం లేదు
కరోనా లాంటి వైరస్ ఒకటి చైనాలో పుట్టిందని అది భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతుందంటూ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలంగాణా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.యూ ట్యూబ్ ఛానెల్స్‌లో దీని పై తప్పుడు ప్రచారం జరగుతుందని మండిపడ్డారు.ఈ HMPV వైరస్ 2001 నుంచే ఉందని సాధారణంగా వచ్చే దగ్గు,జలుబు లాంటిదే తప్ప..పెద్ద ప్రమాదం లేదని చెప్పారు.బాధ్యతాయుతమైన మీడియా కూడా ప్రజల్ని తప్పు దోవ పట్టించి భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు,కథనాలు ఇవ్వడం సమంజసం కాదన్నారు.తుంపర్ల వల్ల ఇతరులకు సోకుంతుదని,ఇలాంటి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు.