భారీగా విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం
ఏపీలో ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు భారం పడనుంది. దీనికి ఇప్పటికే రంగం సిద్ధమయ్యింది. యూనిట్‌కు రూ.4.14 నుండి రూ.6.19 వరకూ పెరగవచ్చని సమాచారం. ఏపీఈఆర్‌సీ ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. మూడు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాత విద్యుత్ ఛార్జీలను సవరించే అవకాశాలున్నాయి. 2022-23లో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించిన ఛార్జీలకు గత నవంబరులో ప్రతిపాదనలు సిద్దమయినా, అమలులోకి రాలేదు. దీనితో ఇప్పుడు మొదలు పెట్టనున్నారు.

