Andhra PradeshcrimeHome Page Slider

ప్రాణాలు తీసిన రైస్ కుక్క‌ర్

విద్యుత్ రైస్ కుక్క‌ర్ ఓ మ‌హిళ ప్రాణాల‌ను నిలువునా బలిగొంది.అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం, అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన వివాహిత‌ వరలక్ష్మి(50) విద్యుత్ రైస్ కుక్క‌ర్‌లో అన్నం వండేందుకు స్విచ్ ఆన్ చేసింది.కొద్ది సేప‌టి త‌ర్వాత మూత స‌రిగా ప‌డ‌లేద‌ని గుర్తించి ర‌న్నింగ్‌లో ఉన్న కుక్క‌ర్ ని తాకింది.అయితే అది ఎర్త్ అయ్యి విద్యుత్ షాక్ కొట్టింది.దీంతో విద్యుదాఘాతానికి గురై స్పృహ త‌ప్పి ప‌డిపోయింది. గ‌మ‌నించిన‌ వ‌ర‌ల‌క్ష్మీ కుటుంబీకులు బాధితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించింది.