రాష్ట్రపతి భవన్‌లో రెండు హాళ్ల పేర్లు మార్పు
రాష్ట్రపతి భవన్‌లో రెండు హాళ్ల పేర్లను మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. కాగా రాష్ట్రపతి భవన్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించే ఐకానిక్ దర్బార్,అశోక్ దర్బార్ హాళ్ల పేర్లను మార్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఐకానిక్ దర్బార్ హాల్‌ను “గణతంత్ర మండప్” గా,అశోక్ దర్బార్‌ను “అశోక్ మండప్”గా మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే భారతీయ సంస్కృతి ,విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవనాన్ని తీర్చిదిద్దేందుకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.

