ముంచుకొస్తున్న మంకీ పాక్స్…….!
మంకీపాక్స్ వైరస్ ప్రపంచమంతా చాలా వేగంగా వ్యాపిస్తుంది. తాజాగా భారత్ లో కూడా ఒక కేసు నమోదైంది. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి నుంచి కోలుకోడానికే చాలా సమయం పట్టింది. మళ్ళీ మరో వైరస్ వేగంగా దూసుకొస్తోంది. ప్రసుత్తం వచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీ లో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిపుణులు టెస్ట్ చెయ్యాడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే మంకీపాక్స్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్త ఉండాలి. అధికం జనాభా ఉన్న ప్రదేశాలకు కొంచెం దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

