భారీ పొడవు వినాయక విగ్రహం శోభాయాత్రకు అతి పెద్ద వాహనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు మోడ్రన్ ట్రయిలర్‌ను యూజ్ చేస్తున్నారు. వోల్వో ఇంజన్‌తో నడిచే బీఎస్ 6 వాహనంలో ఈ తంతు పూర్తి చేస్తారు. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనానికి అనేక టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మహాగణపతి విగ్రహం సుమారు 70 టన్నుల బరువు ఉంటుందని శిల్పి రాజేంద్రన్ చెబుతున్నారు. 11 ఏళ్లుగా స్వామి వారికి రథసారథిగా ఉన్న భాస్కర్‌రెడ్డి ఈ ఏడాది కూడా లారీని డ్రైవ్ చేస్తారు. ఈ ట్రాయిలర్‌తో రోడ్డు ఎలాంటి దైనా అతి తేలికగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతి విగ్రహాన్ని తరలించవచ్చని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగిస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ నిర్వహించి విగ్రహానికి ఉద్వాసన పలికి శోభాయాత్రకు సిద్ధం చేస్తారు.
మధ్యాహ్నం 1.30 కల్లా నిమజ్జనం — నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో జరిగిన మీటింగ్‌లో సీపీ మాట్లాడుతూ ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, సమితి కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్, సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ పాల్గొన్నారు.

