‘నిరుద్యోగ నేత’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన మాజీ మంత్రి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ‘నిరుద్యోగ నేత’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సౌరభ్ బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలతో నా జీవితం తారుమారవడంతో నిరుద్యోగ నేతగా మిలిగిపోయాను. నాతో సహా ఎందరో నేతలను ఈ ఎన్నికలు నిరుద్యోగులుగా మార్చేశాయి. అంటూ వ్యాఖ్యానించారు. ఈ యూట్యూబ్ వేదిక ద్వారా ఓడిపోయిన రాజకీయ నాయకుడి జీవితంలోని పరిస్థితులను మీతో పంచుకుంటా. అలాగే ప్రజలు కూడా మీ సందేశాలను, సలహాలను పంచుకోవచ్చు అంటూ పేర్కొన్నారు. గతంలో మూడు సార్లు ఆయన గ్రేటర్ కైలాశ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికలలో 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ ఈసారి 22 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. ఆప్ కీలక నేతలైన కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్రజైన్ వంటి హేమాహేమీలు కూడా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.

