Home Page SliderTelangana

బాసరలో దోపిడీ దొంగల వీరవిహారం

నిర్మల్ జిల్లా బాసర మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత రెండురోజుల్లో తొమ్మిది ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దోచుకుపోతున్నారు. ఈ దొంగల బెడద వదిలించమంటూ పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. ఐదు ఇళ్లనుండి సుమారు 4 లక్షల రూపాయలు కాజేశారు. ఒక పెళ్లిలో మూడు తులాల బంగారం, లక్షరూపాయల నగదు ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో తాళాలు పగలగొట్టి బీరువాలలో నగలు, విలువైన వస్తువులు కాజేసారు. ఒక వృద్ధురాలిని బెదిరించి పుస్తెలతాడు, నగలు, డబ్బు లాక్కున్నారు. దీనితో బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.