Home Page SliderNational

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..

కేంద్ర కేబినేట్ రైతులకు శుభవార్త చెప్పింది. ఆరు రబీ పంటలకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ కందులపై రూ. 425 పెంచితే, గోధుమలకు రూ.2,275 పెంచారు. బార్లీని క్వింటాలుకు రూ.1850 పెంచారు. రైతులకు మాత్రమే కాక కేంద్రప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీనితో 42 శాతం నుండి 46 శాతానికి డీఏ పెరిగినట్లయ్యింది. అంతేకాక రైల్వే ఉద్యోగులకు బోనస్ కూడా ప్రకటించింది. యువత అభివృద్ధి కోసం ‘మైభారత్’ పేరుతో ఒక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని కేబినెట్ ప్రకటించింది.