Home Page SliderTelangana

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా టాప్ ర్యాంక్‌తో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వన్స్‌డ్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. బీటెక్ ఐఐటీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దీనిలో హైదరాబాద్‌కు చెందిన చిద్విలాస్ రెడ్డి 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సంపాదించాడు. దీనితో జాతీయ స్థాయి పరీక్షలలో రాబోయే విద్యాసంవత్సరానికి తెలుగు విద్యార్థులే మిన్నగా నిలిచారు. జేఈఈ మెయిన్ పరీక్షలలో హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300 కి 300 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఇప్పుడు హైదరాబాద్‌కే చెందిన చిద్విలాస్ రెడ్డి అడ్వన్స్‌డ్‌లో మొదటిర్యాంకు సాధించడం విశేషం. జూన్ 13న విడుదలైన నీట్ ఫలితాలలో కూడా ఏపీకి చెందిన శ్రీకాకుళం అబ్బాయి బోర వరుణ్ చక్రవర్తి 720 మార్కులకు 720 మార్కులతో ప్రథమ ర్యాంకును సాధించాడు.