Home Page SliderTelangana

బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 24 బుధవారం ఉదయం 11 గంటలకు 2024 ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని పేర్కొంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగగా.. 9,80,978 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు.. ఏప్రిల్ 10న పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in and http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.