ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి
తెలంగాణ: బుధవారం ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్-ముంబై మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుండి స్డేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయన్నారు. తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుండి బయలు దేరుతాయని పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.