Home Page SliderNational

దేవర ప్రమోషన్‌ టైంలో పాల్గొన్న తారక్‌, జాన్వీకపూర్‌

 జూనియర్ ఎన్టీఆర్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా దేవర టూ పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నారు. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో -మార్కెట్ చేయడంలో బిజీగా ఉంది ఈ మొత్తం టీం. దేవర ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న గ్రాండ్‌ (ఈరోజు)గా లాంఛ్ చేయబోతున్నారు. తారక్ అండ్ టీం ప్రమోషన్స్‌లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో స్పెషల్ ప్రమోషనల్‌ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. తారక్‌, సైఫ్ అలీఖాన్‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్‌గా కనిపించగా.. జాన్వీకపూర్‌ నీలం రంగు చమ్‌కీల డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ, నడుస్తూ మాట్లాడుతున్నారు. దేవర ప్రమోషనల్‌ స్టిల్స్‌, విజువల్స్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.