మూసీ వద్ద సర్వే.. పాతబస్తీలో ఆందోళనలు..
మూసీనది బఫర్ జోన్‌లో ఉండే ప్రాంతాల వివరాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు అధికారులు. RB-X అనే మార్క్ చేస్తున్నారు. దీనితో పాతబస్తీ, చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనితో అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నామని, అక్కడ నుండి ఎక్కడికి వెళతామంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వారికి పరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే కొందరికి రెండు,మూడంతస్తుల బిల్డింగులు ఉన్నాయని వారికి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇళ్లలో ఉన్న కుటుంబాల ఆధారంగా, కుటుంబ సభ్యుల ఆధారంగా వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూసీ పరివాహక ప్రాంతాలలో 25 సర్వేబృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకూ 13 వేల ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు. కొన్నిచోట్ల సర్వేఅధికారులను స్థానికులు అడ్డుకోవడంతో, పోలీసు బందోబస్తు సహాయం తీసుకుంటున్నారు.

