బంగ్లాదేశ్ ప్రధాని ఆకస్మిక రాజీనామా..కర్ఫ్యూ
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనల్లో 100 మందికి పైగా మరణించారు. దీనితో ఆందోళనకారులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. దీనితో ప్రధాని షేక్ హసీనా ఆకస్మికంగా రాజీనామా చేశారు. అధికారిక భవనం వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారని స్థానిక మీడియా పేర్కొంది. హసీనాతో పాటు ఆమె సోదరి కూడా రాజధాని ఢాకాను విడిచి వెళ్లారని సమాచారం. వేలాదిమంది ఆందోళనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించి, విధ్వంసం సృష్టించారు. దీనితో ఆర్మీ రంగంలోకి దిగి, ఇప్పటికే కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని మీడియా వెల్లడించింది. అక్కడ ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలపై కూడా ఆంక్షలు విధించారు.

