స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాకింగ్ న్యూస్..
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డిలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పాయి. ఇప్పటివరకు తమ వినియోగదారులకు స్పెషల్ లాయల్టీ ప్రోగ్రాం కింద అందిస్తున్న సర్ చార్జీ సౌకర్యాన్ని నిలిపివేశాయి. ఇకపై జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ మెంబర్ షిప్ కలిగిన యూజర్లు సైతం వర్షం సమయంలో లేదా ఇతర ప్రత్యేక పరిస్థితులలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అదనపు డెలివరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలు గతంలో లాయల్టీ ప్రోగ్రాం కింద ఉన్న కస్టమర్లకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఫుడ్ డెలివరీని అందించాయి. అయితే, ఈ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.