నారాయణ సంస్థలకు షాక్..
నారాయణ విద్యాసంస్థలకు మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూరులో ఉన్న నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కిచెన్‌లో అత్యంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. కుళ్లు పోయిన కూరగాయలతో కంపుగా ఉంది. తుప్పు పట్టిన కత్తులు వాడుతున్నారు. ఈగలు, బొద్దింకలు, ఎలుకలు కిచెన్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. ఇలాంటి కిచెన్‌లో నుండి ఆహారాన్ని నారాయణ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. వీటికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేదన్నారు. ఈ కిచెన్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

