ర్యాగింగ్ పేరుతో జూనియర్లను చితకబాదిన సీనియర్లు
ఏపీలో ఇటీవల కాలంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో పల్నాడులోని నరసరావుపేటలో ర్యాగింగ్ భూతం పంజా విసిరింది. కాగా నరసరావుపేటలోని SSN ఎయిడెడ్ డిగ్రీ కళాశాల హాస్టల్‌లో NCC సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో జూనియర్లను దారుణంగా హింసించారు. జూనియర్లను మోచేతులపై నేలపై ఉంచి పిరుదులపై కర్రలతో విపరీతంగా కొట్టారు. దీంతో బాధ భరించలేక జూనియర్లు ఏడుస్తుంటే సీనీయర్లు రాక్షసానందం పొందారు.అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. విచారణలో ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో చూసిన వారంతా సమాజంలో మానవత్వం కలిగి ఎలా జీవించాలో నేర్పించే విద్యాసంస్థల్లోనే మానవత్వం కరువైందని వాపోతున్నారు.