‘నెలకు రూ.40 లక్షలు భరణం ఇవ్వాల్సిందే’..ఆర్తి
తమిళ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు విడాకులిస్తున్నానంటూ జయం రవి ప్రకటించిన కొద్ది సేపటికే తనను సంప్రదించకుండా మీడియాకు వెల్లడించాడని ఆమె ఆగ్రహించారు. ఇటీవల వారిద్దరి విడాకుల కేసుకు సంబంధించి వారిద్దరూ చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు హాజరయ్యారు. రాజీ కోసం కౌన్సిలింగ్‌కు రావాలని కోర్టు సూచించగా, ఆర్తితో వివాహబంధాన్ని కొనసాగించలేనని జయం రవి పేర్కొన్నట్లు అతడి లీగల్ టీమ్ వెల్లడించింది. విడాకులు కావాలంటే తనకు నెలకు రూ.40 లక్షలు భరణం ఇవ్వాల్సిందేనని ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు.