మునుగోడు ఎన్నికల అధికారిగా రోహిత్ సింగ్
మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను ఇవాళ ఎన్నికల కమిషన్ నియమించింది. అంతకు ముందు రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన జగన్నాధ రావును తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించిన అనంతరం జగన్నాధరావు తొలగించడం పట్ల రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఎన్నికల కమిషన్ ఉన్నతా అధికారులు జగన్నాధ రావును రిటర్నింగ్ అధికారిగా విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డివో గా పనిచేస్తున్న రోహిత్ సింగ్ ను రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమించగా ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు.