భద్రాచలం వద్ద గోదావరికి పెరుగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి జలకళను సంతరించుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా పెరుగుతోంది. స్నానఘట్టాల వద్దకు నీరు చేరడంతో చిరువ్యాపారులు తమ దుకాణాలను ఒడ్డుపైకి జరుపుకున్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నీటిపారుదల శాఖ ఆఫీసర్లు హెచ్చరిక బోర్డులు వేల్లాడదీశారు.

