Breaking NewscrimeHome Page SliderNational

రేవంత్ ప్ర‌చారం చేస్తే చాలు….

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాషాయం పార్టీ నాయ‌కులు వ‌ల్ల‌మాలిన అభిమానం పెంచుకుంటున్నారు. పొరుగు రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌చారం చేసిన చోట‌ల్లా కాంగ్రెస్ ఓడిపోయి బీజెపి చ‌రిత్ర సృష్టిస్తుంది.అంతే కాదు…కేంద్ర మంత్రుల‌తోనూ ,బీజెపి ఎంపిల‌తోనూ ఎప్పుడూ స‌ఖ్య‌త‌గా ఉంటూనే ఉన్నారు.తెలంగాణ ఎంపి బండి సంజ‌య్‌, ర‌ఘునంద‌న్‌,అర్వింద్ ..వీరితో పాటు కేంద్ర మంత్రులు అశ్వ‌నీ వైష్ణ‌వ్ ,రామ్మోహ‌న్ నాయుడు ఇలా చాలా మంది బీజెపి కూట‌మి మంత్రుల‌తో నిత్యం అంట‌కాగుతూనే ఉంటున్నారు.దీంతో బీజెపి కూడా రేవంత్ విష‌యంలో వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతుంది. మొన్నామ‌ధ్య‌న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్తే …ఫ‌లితాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది.తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో క‌నీసం ఖాతా తెర‌వ‌కుండానే కాంగ్రెస్ చాప‌చుట్టేసింది.దీంతో కాంగ్రెస్ పార్టీ … రేవంత్ ని ఇక నుంచి పొరుగు రాష్ట్రాల ప్ర‌చారానికి తీసుకెళ్తారా లేదా అని వేచి చూడాల్సిందే.