రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ
నవరాత్రులు పూజలందుకున్న బాలాపూర్ గణపయ్య ఈ రోజు వీడ్కోలు చెప్పడానికి సిద్దమయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలాపూర్ గణపతి లడ్డూ వేలం జరిగింది. ఉత్కంఠ నడుమ లడ్డూవేలం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డులను బ్రేక్ చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి లడ్డూ వేలం రికార్డు స్థాయి ధర పలికింది. ఈ మేరకు లడ్డూ వేలం రూ.24 లక్షల 60 వేలు పలికింది. వంగేటి లక్ష్మణరెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ గణేష్ లడ్డూని దక్కించుకున్నారు.

