Home Page SliderInternational

సేవకు, త్యాగానికీ మారుపేరు నర్స్ (అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)

Share with

మనకేదైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పటల్‌కు వెళతాం. డాక్టర్ సలహా మేరకు మందులు వాడతాం. అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించుకుంటాం. కానీ ఏదైనా పరిచర్యలు కావాలంటే మాత్రం నర్సుల వంక చూస్తాం. వైద్యపరమైన సహాయంతో పాటు రోగికి శుశ్రూష, సేవలు చేసే నర్సుల మేలు మరిచిపోలేం. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అలాంటి నర్సులకు కూడా ఒకరోజు ఉండాలని మే12నాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.

ఈ రోజునే నర్సుల దినోత్సవం జరుపుకోవడానికి కారణం ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’. ఆధునిక నర్సుల పనికి, సేవకు ఆద్యురాలామె. మొదటి ప్రపంచయుద్ద సమయంలో శత్రు సైనికులకు కూడా వైద్యం అందించిన ధైర్యవంతురాలామె. యుద్ధభూమిలో రాత్రుళ్లు లాంతర్ పట్టుకుని సైనిక శిబిరాలలో క్షతగాత్రులకు సేవ చేసి, ప్రాణాలు నిలబెట్టిన త్యాగశీలి. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని బోధించేది ఆమె. తన జీవిత కాలంలో ఎందరో నర్సులకు సరైన శిక్షణనిచ్చి వారిని తీర్చిదిద్దారు. ఆమె జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నేడు జరుపుకుంటున్నాము. ‘లేడీ ఆఫ్ ది ల్యాంప్’ అనే పేరుతో సుప్రసిద్ధమైంది ఆమె జీవితం. ఆమెను ఆదర్శంగా తీసుకుని నేడు నర్సు వృత్తిలో ఎందరో రాణిస్తున్నారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న రోజుల్లో ప్రాణాలను పణంగా పెట్టి నర్సులు చేసిన సేవను ఎవరూ మరిచిపోలేరు.