GHMC పరిధిలో రియల్ బూమ్
HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు, లేఔట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత GHMC, HMDA పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది అని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగినట్లు పేర్కొంది.

