Home Page SliderNational

కూల్‌ అయిన రష్మిక, ఐశ్వర్య వార్

ఐశ్వర్య రాజేష్‌ను తాను అర్థం చేసుకున్నానని, కూల్‌గా సమాధానమిచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. పుష్పలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్రకు తానైతే బాగా సెట్ అవుతానని, ఐశ్వర్య ఒక ఇంటర్యూలో చెప్పిందట. దీనితో అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను రష్మిక పని నుండి ప్రేరణ పొందానని, ఎలాంటి దురుద్దేశం లేదని తెలియజేసింది. దీనికి రష్మిక చాలా స్వీట్‌గా సమాధానం ఇచ్చింది. నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నానని, ఎవ్వరికీ వివరించవలసిన అవసరం లేదని, నీపై ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని, ఐశ్వర్య కొత్త చిత్రం ‘ఫర్హానా’ చాలా బాగుందని ట్వీట్ చేసింది.