ద్రౌపది ముర్ముకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన రాజనాథ్ సింగ్
భారత ప్రధమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆమెకు కేంద్రప్రభుత్వం తరపున శుభాకాంక్షలు అందజేశారు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. ప్రధాని మోదీ కూడా ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు ఆమె 65 వ పుట్టిన రోజు సందర్భంగా సుఖ సంతోషాలతో దీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు ప్రధాని. ప్రధాని అమెరికా టూర్ వెళ్లడంతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్వయంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. ఆమె 1958లో ఒడిషాలోని మయుర్‌భంజ్‌లో ఉపర్బేద అనే గ్రామంలో జన్మించారు. ఆమె 2022 జూలై25న భారత 15 వరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె తన జన్మదిన సందర్భంగా దిల్లీలోని జగన్నాథ్ మందిర్‌కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజే పూరీలోని జగన్నాధ్ యాత్ర కూడా మొదలు కావడం విశేషం. ఈమె గిరిజన తెగకు చెందిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు.

