Home Page SliderNational

మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్న రాహుల్ గాంధీ, ఈసారి ఎందుకంటే?

Share with

రాహుల్ గాంధీ మళ్లీ కోర్టు మెట్లెక్కనున్నారు. విషయమేంటంటే…  ఈసారి కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు రాహుల్. మరి పాతదేమయిందంటే? ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల వివాదంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించడంతో ఆయనకు లోక్ సభ సభ్యత్వం రద్దయ్యింది. దీనితో తన పాస్‌పోర్టుతో సహా అన్ని విదేశాలకు సంబంధించిన పత్రాలను, సంబంధిత అధికారులకు అప్పగించారు. దీనితో ఆయన కొత్త పాస్‌పోర్టుకు అప్లయ్ చేయాల్సి వచ్చింది. గతంలోనే నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రాహుల్ నిందితుడిగా ఉండడంతో ఇప్పుడు పాస్‌పోర్ట్ జారీ కోసం ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ కావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాహుల్. న్యాయస్థానం మే 26, శుక్రవారం విచారణ చేపట్టనుంది. రాహుల్ మే 31 నుండి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అనంతరం వాషింగ్టన్, కాలిఫోర్నియాలలోని పలు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.