18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు
టిజి: రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్ 1లో 10,083 మంది ఎస్‌జిటిలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎమ్‌లుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్ 2లో ఎస్‌జిటి నుండి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, 776 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్‌ఎమ్‌లు అయ్యారు.