Home Page SliderInternational

యూట్యూబ్‌లో ప్రధాని మోదీ అరుదైన రికార్డు

భారతప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు నెలకొల్పారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో నరేంద్రమోదీ 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను పొందారు. దీనితో ప్రపంచంలోనే ఇంతమంది సబ్ స్క్రైబర్లను పొందిన దేశాధినేతగా చరిత్ర సృష్టించారు. తన పర్యటనల వివరాలను, బీజేపీ కార్యక్రమాలను, దేశంలో ముఖ్యమైన కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రణాళికలను, తన విదేశీ పర్యటనల వివరాలను, దేశాభివృద్ధికి సంబంధించిన ఇతర వివరాలను ఆయన ఈ వీడియోలలో పోస్టులు చేస్తూంటారు. వీడియోలు, లైవ్ ప్రోగ్రాముల ద్వారా గతంలో ఏ ప్రధాని చేపట్టని వినూత్న కార్యక్రమాలు చేపట్టి భారత ప్రజలలో అత్యంత ఆదరణ గల ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు.