పోర్న్ రాకెట్ కేసు.. శిల్పాశెట్టి ఇంట్లో ఈడీ సోదాలు
బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పోర్న్ రాకెట్ కేసులో ఈడీ మరోమారు రంగంలోకి దిగింది. ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్న ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా ఒకసారి అరెస్ట్ అయ్యారు. రెండు నెలల తర్వాత సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు. ఫిబ్రవరి 2021లో పోలీసులు ఈ పోర్నోగ్రఫీ రాకెట్ ను గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని మోడళ్లు, యువతులను నమ్మించి బలవంతంగా వారితో అశ్లీల చిత్రాలు తీసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కుంద్రా సహా పూనం పాండే, షెర్లీన్ చోప్రా, ఉమేశ్ కామత్ లు కూడా నిందితులుగా ఉన్నారు.

