crimeHome Page SliderNews AlertTelanganatelangana,viral

పోలీస్ వాహనాల ‘ఫాస్టాగ్‌’లు మాయం..ఇంటి దొంగ పనే..

హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్ వాహన డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చిన వ్యక్తి డిపార్ట్‌మెంట్‌కే షాక్ ఇచ్చాడు. నిస్సార్ మైమద్ అనే కానిస్టేబుల్ పోలీస్ వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్లను దొంగిలించి క్యాబ్ డ్రైవర్లకు అద్దెకు ఇచ్చేవాడు. వీటిపై రూ.8 వేల వరకూ అద్దె వసూలు చేసేవాడు. ఈ దందా ఏడాదిగా జరుగుతోందని తాజాగా పోలీసులు గుర్తించారు. ఫాస్టాగ్ స్టిక్కర్ల దొంగతనం జరుగుతోందని గుర్తించిన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేయడంతో ఇంటిదొంగ నిస్సార్ మైమద్‌గా గుర్తించారు. ఫాస్టాగ్ స్టిక్కర్‌లను గుర్తించిన మూడు క్యాబ్‌లను సీజ్ చేసి నిందితుడు నిస్సార్ మైమద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.