Home Page SliderTelangana

విద్యార్థులపై విష ప్రయోగం.. నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరిలోని ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకు లో పురుగుల మందు కలిపారు. ట్యాంక్ తో పాటు మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాఠశాల హెచ్ ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగు మందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.