Home Page SliderNational

హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ప్రముఖ తెలుగు పాపులర్ టెలివిజన్ షో బిగ్‌బాస్‌కు హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నడు లేని విధంగా బిగ్‌బాస్ హోస్ట్‌ నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.కాగా బిగ్‌బాస్ పేరుతో అక్రమంగా 100 రోజులపాటు కొందరు వ్యక్తుల్ని నిర్భందించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిని సైతం విచారించాలని అడ్వకేట్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్‌బాస్ అభిమానులు ఆర్టీసి సహా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రను బయటకు తీయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి ప్రధాన కారణం ఆదివారం  విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన తర్వాత నెలకొన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. కాగా ఆయన విన్నర్‌గా బయటకు వచ్చిన తర్వాత పోలీసుల అనుమతి లేకుండా తన అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పల్లవి ప్రశాంత్ అభిమానులు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల కార్ల అద్దాలు,ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం పగుల గొట్టారు. కాగా దీనిపై సీరియస్ అయిన  హైదరాబాద్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై  కేసు నమోదు చేశారు.